POLICE E:NEWS BBMA// డిఫెన్స్ ఉద్యోగాల్లో తేజస్ అకాడమీ ఘన విజయం కరీంనగర్‌కు చెందిన తేజస్ అకాడమీ విద్యార్థులు డిఫెన్స్ నియామక ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి 160 ఉద్యోగాలు సాధించారు. హన్మకొండ ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థుల్లో 156 మంది ఇండియన్ ఆర్మీ, 3 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీరులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన “తేజస్ శౌర్య–2026” కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థులను సత్కరించారు. ఇప్పటివరకు 2,000 మందికి పైగా విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినట్లు అకాడమీ చైర్మన్ సి.హెచ్. సతీష్ రావు తెలిపారు.

కరీంనగర్‌లోని తేజస్ అకాడమీ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఇటీవల విడుదలైన డిఫెన్స్ నియామక ఫలితాల్లో అకాడమీకి చెందిన 160 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు చైర్మన్ సి.హెచ్. సతీష్ రావు తెలిపారు. జూన్ 2025లో నిర్వహించిన హన్మకొండ ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థుల్లో 156 మంది ఇండియన్ ఆర్మీలో, 3 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీరులుగా ఎంపికయ్యారు. ఇండియన్ ఆర్మీలో జీడీ విభాగంలో 131 మంది, ట్రేడ్స్‌మెన్‌లో 12 మంది, టెక్నికల్‌లో 13 మంది ఎంపిక కాగా, ఎయిర్ ఫోర్స్‌లో ముగ్గురు నాన్-టెక్నికల్ విభాగంలో ఎంపికయ్యారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని “తేజస్ శౌర్య–2026” కార్యక్రమాన్ని నిర్వహించి ఎంపికైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. జూన్ 8 నుంచి వారు తమ ట్రైనింగ్ సెంటర్లలో రిపోర్ట్ చేయనున్నారు. డిఫెన్స్ రంగంతో పాటు ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయి మార్కులు సాధిస్తూ తేజస్ అకాడమీ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు 2,000 మందికి పైగా విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినట్లు సతీష్ రావు వెల్లడించారు.