డోర్నకల్ త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిపిఐ

డోర్నకల్ త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిపిఐ
డోర్నకల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ నాగరాజు నాయక్‌కు సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదు నుంచి ఆరు నెలలుగా పట్టణంలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉందని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదన్నారు. ప్రధాన బజార్ మినహా అనేక వార్డుల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి వార్డుకు వారానికి కనీసం ఒకసారి చెత్త ట్రాక్టర్ పంపించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. అలాగే మున్నేరు వాగులోని మోటార్లను మరమ్మతు చేసి, మిషన్ భగీరథ నీటితో పాటు మున్నేరు నీటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, తురక రమేష్ బాబు, ఎల్లావుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.