ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఐదు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల భద్రత, విపత్తుల నిర్వహణ, కమ్యూనల్ అంశాలు, నేర నియంత్రణ వంటి కీలక అంశాలపై చర్చించారు. డ్రోన్ పోలీసింగ్, ఏఐ ఆధారిత సాంకేతికత, సోషల్ మీడియా మానిటరింగ్, సీసీటీవీ వ్యవస్థల బలోపేతంపై దృష్టి సారించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, సమన్వయం, జవాబుదారీతనం పెంపుతో పాటు ప్రాథమిక పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

POLICE NEWS BBMA// ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఐజీ, అదనపు డీజీ, డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులతో ఐదు గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తెలంగాణ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తూ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల అరికట్టడం, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల భద్రత, విపత్తుల నిర్వహణ, సామాజిక శాంతి భద్రతలు, ఆహార కల్తీ నియంత్రణ వంటి అంశాలను ప్రాధాన్యతగా గుర్తించారు. డ్రోన్ పోలీసింగ్, సోషల్ మీడియా మానిటరింగ్, సీసీటీవీ వ్యవస్థల పునరుద్ధరణ, ఐసీసీసీ సమర్థ వినియోగం, పోలీస్ స్టేషన్ల బలోపేతంపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, సమన్వయం, జవాబుదారీతనం పెంపుతో పాటు ప్రాథమిక పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.