కరీంనగర్ జ్యోతి నగర్ ఆగస్టు 7
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత్రి, న్యూస్ రీడర్ పెనుగొండ సరసిజ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో భాగమైన స్వదేశీ ఉద్యమానికి ఊతమిచ్చింది చేనేత వస్త్ర పరిశ్రమే అని, కానీ నేటి కాలంలో చేనేత రంగానికి ఆదరణ కరువు అవుతున్నందున ప్రతి ఒక్కరు చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించి నేతన్నకు ఊతమివ్వాలని పిలుపునిచ్చారు.
అవగాహన కార్యక్రమం అనంతరం పాఠశాల విద్యార్థులు చేనేత కర్మాగారానికి క్షేత్ర పర్యటనకు వెళ్లారు. అక్కడ మరమగ్గాలు పనిచేసే విధానం, చేనేత కళాకారుల పనితనాన్ని దగ్గరుండి తెలుసుకున్నారు. విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో పాఠశాల డీజీఎం సచిన్ ప్రధానోపాధ్యాయురాలు నాగ ప్రణవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం పట్ల ఎస్.ఆర్. విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి , హర్షం వ్యక్తం చేశారు.