భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేటి పోటీ ప్రపంచంలో విజయానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. టెక్నాలజీ నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం, సమయపాలన, స్పష్టమైన లక్ష్యాలు ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. యువత తమ ప్రతిభను సరైన దిశలో వినియోగించుకోవాలని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను నేర్చుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరిస్తూ వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. “మీ భవిష్యత్తును మీ ప్రతిభ, శ్రమ, జ్ఞానంతో నిర్మించుకోండి” అని విద్యార్థులకు సందేశమిచ్చారు. భూపాలపల్లి పోలీసులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు యువతను సానుకూల దిశగా నడిపించేందుకు దోహదపడతాయని ఎస్పీ తెలిపారు. విద్యార్థులు టెక్నాలజీని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలన్నారు.
NATIONAL BUREAU CHIEF
BOJJAM RAMESH