పెద్దపల్లి, ఆగస్టు 6 (బీబీఎంఏ న్యూస్):
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పీఎం కుసుమ్ పథకం కింద నిర్మించిన 1 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఆగస్టు 10 నాటికి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన విద్యుత్ కనెక్షన్లు, సాంకేతిక ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి నిర్ణీత గడువులో ప్లాంట్‌ను ప్రారంభించాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఇటువంటి ప్రాజెక్టులు కీలకమని పేర్కొంటూ, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతను పాటిస్తూ మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ రాముడు, పీఏసీఎస్ చైర్మన్ రాంచందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కోలేటి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.