కరీంనగర్, ఆగస్టు 6: పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక, ప్రముఖ వాగ్గేయకారుడు, సామాజిక విప్లవ కవి దివంగత గద్దర్ గారి మూడో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, గద్దర్ తన పాటను ప్రజల పోరాటానికి ఆయుధంగా మార్చి పీడిత వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి గద్

కరీంనగర్, ఆగస్టు 6:
పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక, ప్రముఖ వాగ్గేయకారుడు, సామాజిక విప్లవ కవి దివంగత గద్దర్ గారి మూడో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, గద్దర్ తన పాటను ప్రజల పోరాటానికి ఆయుధంగా మార్చి పీడిత వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి గద్దర్ విశేషంగా ఊపిరి పోశారని, ప్రజల్లో చైతన్యం నింపడంలో ఆయన పాత్ర అమూల్యమని నాయకులు అన్నారు. గద్దర్ వంటి మహానాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గూడ కనకయ్య, తాళ్ల వెంకటేష్, దామెర సత్యం, పాఠకుల భూమయ్య, గంభీరావుపేట అంజయ్య, చాతల్ల కృష్ణ, కోరంరవి ప్రసాద్, దండి రవీందర్, బందెల రాజలింగం, చిలుక రామస్వామి, చిన్న దాసరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.