కరీంనగర్, తిమ్మాపూర్ఆగస్టు 6, ఎల్‌ఎండీ కాలనీ, తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (World Breastfeeding Week-2026) సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP), కరీంనగర్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAIMS) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న డా. శ్రీ రామ్ జాజు, పీడియాట్రిక్స్ విభాగాధిపతి, డా. శ్రీదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. నూతన

కరీంనగర్, తిమ్మాపూర్ఆగస్టు 6,
ఎల్‌ఎండీ కాలనీ, తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (World Breastfeeding Week-2026) సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP), కరీంనగర్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAIMS) సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న డా. శ్రీ రామ్ జాజు, పీడియాట్రిక్స్ విభాగాధిపతి, డా. శ్రీదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. నూతనంగా ప్రసవించిన తల్లులు వివిధ కారణాల వల్ల పిల్లలకు సరైన విధంగా తల్లిపాలు అందించలేకపోతున్నారని, అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశు పోషణ, తల్లుల ఆరోగ్యం, తల్లిపాలపై సమాజంలో అవగాహన పెంపు వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు.
కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని, వాటి ప్రాముఖ్యతను ప్రతి కుటుంబం గుర్తించాలని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. రామ నర్సింహరెడ్డి మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరూ సమాజంలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కె. నరేందర్ రెడ్డి, హెచ్‌వోడీలు డా. రవీందర్ రెడ్డి, డా. చంద్రమౌళి, అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.