POLICE E:NEWS BBMA// కౌమార యువతకు జీవన నైపుణ్యాలే భవిష్యత్ నాయకత్వానికి పునాది: లయన్ కోదండరామ్ సింహరాజు కరీంనగర్, జూన్ 12: కౌమార యువతలో ఆధునిక జీవన నైపుణ్యాలు పెంపొందితేనే సమర్థవంతమైన నాయకత్వం రూపుదిద్దుకుంటుందని లయన్ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు అన్నారు. సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల లయన్స్ క్వెస్ట్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, మానసిక సమతుల్యత, సామాజిక బాధ్యత పెంపొందించడంలో ఈ శిక్షణ కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

POLICE E:NEWS BBMA//

కౌమార యువతలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలి - లయన్ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు

కరీంనగర్, జూన్ 12: కౌమార యువతలో ఆధునిక జీవన నైపుణ్యాలు పెంపొందితేనే భవిష్యత్ భారతదేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభిస్తుందని లయన్ జిల్లా గవర్నర్ లయన్ సింహరాజు కోదండరామ్ పేర్కొన్నారు. స్థానిక సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల లయన్స్ క్వెస్ట్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టీన్ ఏజ్ విద్యార్థుల్లో శారీరక, మానసిక, భావోద్వేగ సమతుల్యత పెంపొందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు.

విశిష్ట అతిథి లయన్ ఎం. భద్రేశం మాట్లాడుతూ మార్కులు, ర్యాంకులకు మాత్రమే పరిమితమైన విద్యా విధానంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల చైర్మన్ లయన్ డా. పి. ఫాతిమా రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఇలాంటి శిక్షణలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.