ప్రస్తుత సీఐ రాజుకు ఐజీపీ కార్యాలయానికి బదిలీ
మంథని, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్): ఆసిఫాబాద్ సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న బుద్దే స్వామిని మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా నియమిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంథని సీఐగా పనిచేస్తున్న రాజును ఐజీపీ కార్యాలయానికి బదిలీ చేసినట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
పోలీస్ శాఖలో నిర్వహించిన తాజా బదిలీల్లో భాగంగా ఈ నియామకం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుద్దే స్వామి గతంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించి మంచి సేవలు అందించిన అధికారిగా గుర్తింపు పొందారు.
మంథని సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని బుద్దే స్వామి పేర్కొన్నట్లు తెలిసింది. ఆయన నియామకంపై స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.